తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని స్వగృహంలో రాత్రి నిద్రలోనే గుండెపోటు రావడంతో అభినయ్ హఠాత్తుగా మరణించాడని, ఉదయం చూసుకున్న ఇంటి సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకున్న అభినయ్ కి ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
తన ఫ్యామిలీ డాక్టర్ నే పెళ్లి చేసుకున్న వాణిశ్రీకి ఒక కుమారుడు, ఒక కుమార్తె. చెట్టంత ఎదిగిన కుమారుడు చనిపోవడంతో వాణీశ్రీ తో పాటు కుటుంబం అంతా శోఖ సముద్రంలో మునిగింది. ఈ రోజు సాయంత్రం చెన్నైలోనే అభినయ్ కి అంత్య క్రియలు నిర్వహించనున్నారు. వాణీశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.