అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం పుట్టినరోజు విషెస్ చెపుతూ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.
కృష్ణ గారు అతిధి పాత్రలో మెరిసిన ‘యమలీల’ చిత్రంలోని ‘జుంబారే’ పాటను రీమిక్స్ చేస్తూ జుంబారే రీలోడెడ్ అనే వీడియో టీజర్ విడుదల చేసారు. పాటలో అశోక్, నిధిలు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించారు.
అశోక్ గల్లా వీడియోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ ‘’ఆయన ఎల్లప్పుడూ నాతో పాటు ఎన్నో లక్షల మందిని ప్రభావితుల్ని చేసిన సూపర్ స్టార్. ఆయనతో ఎంతో దగ్గరగా ఉండగలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని, హ్యాపీ బర్త్ డే తాతా! మీరు మా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్’ అని పేర్కొన్నాడు.
ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన దర్శకుడు ఎస్.జే.సూర్య ‘కంగ్రాట్స్ అశోక్ గల్లా, హ్యాపీ ఫర్ యూ..వాట్ ఏ చేంజ్.. అతను నాని సినిమాలో చిన్న పిల్లాడు …ఇప్పుడో హీరో …వీడియో చాలా బాగుంది..ఆల్ ది బెస్ట్ శ్రీరాం అండ్ టీం’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు శ్రీరాం ఆదిత్య, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తమ తమ పేజీల్లో వీడియోను అభిమానులతో పంచుకున్నారు.