లాక్‌డౌన్‌లో షూటింగ్‌ కు వెళ్లిన మొదటి టాలీవుడ్‌ మూవీ ఇదే

రెండు నెలలుగా షూటింగ్స్‌ లేని టాలీవుడ్‌లో ఎట్టకేలకు షూటింగ్స్‌ మొదలు అయ్యాయి. సీరియల్స్‌ షూటింగ్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా టాలీవుడ్‌కు చెందిన మొదటి షూటింగ్‌ మాత్రం రవిబాబు చేశాడు. ప్రస్తుతం రవిబాబు అంతా కొత్త వారితో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా మద్యలోనే ఆగిపోయింది. ఆ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా హైదరాబాద్‌లోనే ఉండటంతో రవిబాబు వెంటనే షూటింగ్‌ను మొదలు పెట్టాడు.

రవిబాబు ఏం చేసినా చాలా గమ్మత్తుగా విభిన్నంగా జనాల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ వైరస్‌ టైంలో కూడా ఆయన షూటింగ్‌ అంతే వినూత్నంగా ఉంటుంది. నేడు షూట్‌ చేసిన సీన్‌లో హీరో హీరోయిన్‌ హగ్‌ చేసుకునే సీన్‌ను చిత్రీకరించారు. అయితే ప్రస్తుతం ఉన్న వైరస్‌ దృష్ట్యా హగ్‌ సీన్స్‌ నిషేదం. కనుక హీరో హీరోయిన్‌ మద్యలో ఒక గ్లాస్‌ పెట్టి అటు ఇటు హీరో హీరోయిన్‌ను నిలబెట్టి హగ్‌ చేసుకున్నట్లుగా ఫీల్‌ అవ్వాల్సిందిగా వారికి సూచించాడు.

గ్రాఫిక్స్‌లో వారిద్దరు హగ్‌ చేసుకున్నట్లుగా చూపిస్తాడు కావచ్చు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. లాక్డౌన్‌ తరువాత రవిబాబు షూటింగ్‌ మొదలు పెట్టాడు. బలే గమ్మత్తుగా వుంది ఈ ఫన్నీ రొమాంటిక్‌ సన్నివేశం అంటూ ఆయన తండ్రి చలపతి రావు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలాగే ఆయన ఈ వీడియోను కూడా షేర్‌ చేశారు.