అల్లుడు శీనుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ తరహాలో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్గా అల్లుడు అదుర్స్‌ను తెరకెక్కిస్తున్నారు. సినిమాను సమ్మర్ చివరి వరకు పూర్తి చేయాలని భావించారు. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో లాక్డౌన్ టైమ్ లో స్క్రిప్ట్‌కు మరింతగా మెరుగులు దిద్దారట.
కరోనా ఇప్పట్లో పూర్తిగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కనుక షూటింగ్‌ను మొదలు పెట్టి జాగ్రత్తలు పాటిస్తూ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. అందుక సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. విభిన్నమైన టైటిల్ తో ఇప్పటికే మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను ఈ ఏడాది చివరి వరకు విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కాస్త రిస్క్ అయినా షూటింగ్ ను చేయాలని సిద్దం అయ్యారు.
ఈ చిత్రంలో బెల్లంకొండకు జోడీగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రలో అను ఎమాన్యూల్ నటించబోతుంది. సోనూసూద్ మరియు ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సుబ్రమణ్యం నిర్మిస్తున్నాడు. రాక్షసుడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమా అవ్వడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తాడేమో చూడా