ఇంకా ఐసీయూలోనే.. నాన్నగారి పరిస్థితి అలాగే ఉంది

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఆయన తనయుడు చరణ్‌ ఎప్పటికప్పుడు తండ్రి ఆరోగ్యం విషయంలో సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. ఇటీవల నాన్న ఆరోగ్యం గురించి ఏ ఒక్కరు ఆందోళన చెందనక్కర్లేదని ఐసీయూలో ఉన్న ఆయన వైధ్యులను గుర్తు పట్టడంతో పాటు మాట్లాడుతున్నారు అంటూ పేర్కొన్నారు. ఇక నేడు ఉదయం నుండి బాలు గారిని ఐసీయూ నుండి రూంకు మార్చారంటూ వార్తలు వచ్చాయి.

బాలు గారికి వెంటిలేటర్‌ తొలగించి సాదారణ రూంకు మార్చారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో చరణ్‌ మళ్లీ ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎలా అయితే నాన్నగారు ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా నాన్న ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయనకు వైధ్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే ఐసీయూ నుండి బయటకు వస్తారని ఆశిస్తున్నామని చరణ్‌ అన్నారు. దాంతో సాదారణ రూంకు మార్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది.