సోనూసూద్‌ మరో సంచలన నిర్ణయం


ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ గత నాలుగు అయిదు నెలలుగా సోషల్‌ మీడియాలో రియల్‌ హీరో అంటూ కీర్తించబడుతున్నాడు. వలస కార్మికులకు సాయం చేయడంను మొదలుకుని ప్రమాదంలో బర్రె చనిపోతే పేద కుటుంబానికి బర్రెను కొనిచ్చే వరకు ఎన్నో వేల మందికి సాయం చేశాడు. ఆయన చేస్తున్న సాయం సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇక విద్యార్థులు ఇండియాలో విద్య కోసం పడుతున్న కష్టాలను ఆయన ఇటీవల దగ్గర నుండి చూసి చలించి పోయాడట. దాంతో అర్హులు అయిన ప్రతి విద్యార్థి విద్యార్థినికి పూర్తిగా ఉచిత విద్యను అందించబోతున్నట్లుగా ప్రకటించాడు. అందుకు సంబంధించి కొన్ని సింపుల్‌ కండీషన్స్‌ ను ఆయన పెట్టడం జరిగింది.

సోనూసూద్‌ తల్లి పంజాబ్‌ లో ఉపాధ్యాయురాలు. ఆమె ఎంతో మంది పిల్లలకు ఉచితంగా విధ్యను అందించారు. ఆమె పలు సార్లు పిల్లల చదువులకు సాయం చేయమంటూ కోరేవారట. అప్పుడు వీలు పడలేదు. ఇప్పుడు తల్లి కోరిక మేరకు విద్యార్థుల చదువుకు సాయం చేసేందుకు సిద్దం అయ్యాడు. తన తల్లి పేరుతో స్కాలర్‌ షిప్‌ ను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. అందుకు గాను కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. రెండు లక్షల వార్షిక ఆదాయం మించకుండా, చదువులో మంచి మార్కులు వచ్చిన వారికి తాను ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని ప్రకటించాడు.

దేశంలోని పలు విశ్వవిధ్యాలయాలతో ఒప్పందం కుదుర్చకున్నాం. అర్హులు అయిన పిల్లలు అందరికి కూడా కోర్సు ఫీజుతో పాటు వసతి మరియు ఆహారం కూడా ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ తన మెయిల్‌ ఐడీని ఇచ్చాడు. దాని ద్వారా దరకాస్తు చేసుకోవచ్చు అన్నాడు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా దరకాస్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి వాటిని ఎలా సాల్వ్‌ చేసి సాయం అందిస్తాడు అనేది చూడాలి. ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నది. అయినా కూడా సోనూసూద్‌ మంచి మనసుతో సాయం చేసేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం.