ఫొటోటాక్ : ఈ నూనూగు మీసలా పెళ్లికొడుకును గుర్తు పట్టగలరా?


ఈ ఫొటోలో ముసి ముసి నవ్వులు నవ్వుతున్న నూనూగు మీసాలతో పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఇతడిని గుర్తు పట్టారా.. ప్రస్తుతం ఈయన ఓ యంగ్ స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులను దేవదాసుగా పలకరించి రెడీ అంటూ అభిమానులను సొంతం చేసుకుని నేను శైలజతో ఒక మంచి ఫీల్ గుడ్ ను అందించి ఇస్మార్ట్ శంకర్ గా దుమ్ము దులిపాడు. ఇప్పటికే ఈయన ఎవరో అర్థం అయ్యి ఉంటుంది. అవును ఎనర్జిటిక్ స్టార్ రామ్ నే ఇది. చాలా క్యూట్ గా ఉన్న రామ్ ఫొటోను నెటిజన్స్ ప్రస్తుతం తెగ ప్రశంసిస్తున్నారు.

రామ్ ఫ్యాన్ పేజీలో షేర్ అయిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అన్నట్లుగా రామ్ అప్పుడు ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదో పెళ్లి సందర్బంగానో లేదా మరేదో కార్యక్రమంలో ఇలా రామ్ కనిపించాడు. ప్రస్తుతం రామ్ ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే సమయంలో రామ్ మరియు త్రివిక్రమ్ ల మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.