ఫొటోటాక్ : అల్లు బాబాయి షూటింగ్ సెట్ లో అమ్మాయి సందడి


అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ కొత్త సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. లాక్ డౌన్ కు ముందు నుండే చాలా గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ఎట్టకేలకు తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు. రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో ప్రత్యేక గెస్ట్ గా అల్లు అన్విత పాల్గొన్నారు. అల్లు అరవింద్ మనవరాలు అయిన అల్లు అన్విత షూటింగ్ ను చాలా ఆసక్తిగా గమనించడం ఇక్కడ చూడవచ్చు.

అల్లు ఫ్యామిలీలో పెద్ద అమ్మాయి అయిన అల్లు అన్విత అల్లు బాబీ కూతురు అనే విషయం తెల్సిందే. అల్లు ఫ్యామిలీలో ఈ జనరేషన్ పెద్ద అమ్మాయిగా అల్లు అరవింద్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఏ పూజా కార్యక్రమాలు జరిగినా కూడా ఇలా ఆ పాపను ముందు ఉంచుతారు అంటూ ఉంటారు. తాజాగా అల్లు శిరీష్ మూవీ మొదటి రోజు షూటింగ్ అవ్వడం వల్ల అల్లు అన్విత చేతుల మీదుగా పూజ చేయించినట్లుగా తెలుస్తోంది. అల్లు శిరీష్ ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో లేదా దసరా వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.