‘విసుగొస్తోంది.. ఆపేయమన్న’ ఫ్యాన్స్ కి కంగనా సమాధానం..!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాల నుంచి సమకాలీన రాజకీయాల వరకు.. ఏ అంశంపైన అయినా కుండబద్దలు కొట్టినట్లు తనదైన శైలిలో అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. అది తర్వాత తీవ్ర వివాదంగా మారినా కంగనా కేర్ చేయదు. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్ కంగనా అనేక వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా సోషల్ మీడియా మాధ్యమాలలో మరింత యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది. బాలీవుడ్ పైన మరియు మహారాష్ట్రలో ఉన్న శివసేన ప్రభుత్వంపైనా అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. అలానే హత్యాచారాలు.. అర్ణబ్ గోస్వామి అరెస్టు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇలా ప్రతి అంశంపై ట్విట్టర్ లో స్పందిస్తూ వస్తోంది. అయితే కొంతమంది అభిమానులకు కంగనా తీరు నచ్చలేదు. ఒకే అంశం గురించి పదే పదే స్పందిస్తుంటే బోరింగ్ గా ఉందని.. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండమని కంగనా ను కోరారు.

కంగనా రనౌత్ దీనిపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. ”రోజంతా నా ట్వీట్లు చెక్ చేస్తూ విసుగు చెందామని.. సైలెంట్ గా ఉండమని కోరిన అభిమానులు నన్ను మ్యూట్ చేయండి లేదా అన్ ఫాలో అవ్వడండి లేదా బ్లాక్ చేయండి. అలా చేయకపోతే స్పష్టంగా మీ ఆసక్తి మొత్తం నాపై ఉన్నట్లే అర్థం. నన్ను ద్వేషించే వారిలా ప్రేమించొద్దు” అని కంగనా ట్వీట్ లో పేర్కొన్నారు. ఫ్యాన్స్ విజ్ఞప్తి చేసినా కంగనా మాత్రం తనదైన శైలిలో వ్యవహరిస్తానని స్పష్టం చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కంగనా ప్రస్తుతం దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమాలో నటిస్తోంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మిస్తున్నాడు. అరవింద్ స్వామి – ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కంగనా దీంతో పాటు ‘తేజస్’ మరియు ‘ధాకడ్’ అనే మరో రెండు హిందీ సినిమాల్లో నటించనుంది.