ఫొటోటాక్ : సూపర్ స్టార్ బ్యాక్ కూడా బ్యూటీఫుల్


మహేష్ బాబు ఫొటోలు మరియు ఆయన పిల్లల ఫొటోలు ఈమద్య సోషల్ మీడియాలో తరుచు వైరల్ అవుతూనే ఉన్నాయి. మహేష్ బాబు ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేస్తూ నెటిజన్స్ కు అందిస్తున్న నమ్రత ఇటీవల తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇలా ఎవరైనా ఉంటారా అంటూ ఒక కూల్ మహేష్ ఫొటోను షేర్ చేసింది. తాజాగా మరో ఫొటోను నమ్రత షేర్ చేసింది. కారులో ప్రయాణిస్తున్న సందర్బంగా తీసిన ఫొటో ఇది. మహేష్ బాబు ముందు కూర్చోగా వెనుక నుండి ఫొటో తీశారు.

ఈ ఫొటోను షేర్ చేసిన నమ్రత బ్యాక్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్ పెట్టింది. నిజంగానే మహేష్ బాబును బ్యాక్ సైడ్ యాంగిల్ నుండి చూస్తే వావ్ అనిపించేలా ఉన్నాడు. నమ్రత రెగ్యులర్ గా తమ అభిమాన హీరో ఫొటోలను షేర్ చేస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నారు. రెండు గంటల్లోనే ఈ ఫొటో దాదాపుగా లక్ష లైక్స్ ను దక్కించుకున్నాయి అంటే ఏ స్థాయిలో మహేష్ ఫొటోలకు క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తాజాగా లాంచనంగా ప్రారంభం అయ్యింది. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.