బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 86 – మోనాల్‌ ఉగ్ర రూపం.. అఖిల్‌, అభిజిత్‌లపై కోపంతో అవినాష్‌ పై అటాక్.!

ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్‌ పక్రియ కాస్త విభిన్నంగా రసవత్తరంగా జరిగింది. ముందు నుండి అనుకుంటున్నట్లుగా కాకుండా ఈసారి ఊహించని వ్యక్తులను కంటెస్టెంట్స్‌ నామినేట్‌ చేయడం జరిగింది. అవినాష్‌ ను ఎక్కువ మంది టార్గెట్‌ చేయగా ఆ తర్వాత మోనాల్‌ ను ఎక్కువ మంది నామినేట్‌ చేశారు. ఆదివారం ఎపిసోడ్‌ కు కంటిన్యూగా తాజా ఎపిసోడ్‌ లో కొంత డ్రామా సాగింది. అవినాష్‌ తాను పాస్‌ ద్వారా సేవ్‌ అవ్వడం తట్టుకోలేక పోయాడు. ప్రేక్షకులు ఓట్లు వేయక పోవడం వల్ల తాను ఓడిపోయాను. ఇంకా తాను ఎవరి కోసం ఆడాలి అంటూ అవినాష్‌ ఆవేదన వ్యక్తం చేయడంతో అఖిల్‌ మరియు సోహెల్‌ లు అతడిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ బయటకు వచ్చి ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించాడు.

నామినేషన్‌ పక్రియలో భాగంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ ముందు ఉండే కంటేనర్‌ లు ఉన్నాయి. ఒకొక్కరు ముందుకు వచ్చి ఇద్దరు లేదా అంతకు మించి కంటేనర్‌ లో తమ వద్ద ఉన్న రంగు నీటిని పోయాల్సి ఉంటుంది. హారికతో పక్రియ ప్రారంభం అయ్యింది. ఆమె అవినాష్‌ మరియు అభిజిత్‌ ను నామినేట్‌ చేసింది. తాను ఇచ్చిన పాస్‌ నీకు సంతృప్తి ఇవ్వక పోవడం నాకు నచ్చలేదు అంటూ ఏదో అర్థం కాని రీజన్‌ చెప్పి అవినాష్‌ ను నామినేట్‌ చేసింది. ఆ తర్వాత గత వారం అభిజిత్‌ టాస్క్‌ చేయక పోవడం వల్ల తాను నామినేట్‌ చేస్తున్నట్లుగా పేర్కొంది. మోనాల్‌ మరియు అఖిల్‌ లను అవినాష్‌ నామినేట్‌ చేశాడు. మోనాల్‌ నువ్వు వీక్‌ అంటే ఒప్పుకోలేదు అందుకే నామినేట్‌ చేశాను అన్నాడు. అఖిల్‌ అనూహ్యంగా మోనాల్‌ మరియు అవినాష్‌ ను నామినేట్‌ చేశాడు. అభిజిత్‌ కూడా మోనాల్‌ ను మరియు హారికను నామినేట్‌ చేశాడు. మోనాల్‌ చాలా ఆవేశంతో అవినాష్‌ ను ఇంకా అఖిల్‌ ను నామినేట్‌ చేసింది. అరియానా ముగ్గురిని నామినేట్‌ చేసింది. హారిక, మోనాల్‌, సోహైల్‌ లను ఆమె చేసింది. చివరగా సోహెల్‌ ముందుకు వచ్చి అవినాష్‌ మరియు అరియానాలను నామినేట్‌ చేశారు.

ఈ వారం నలుగురు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అవుతారు అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించగా ఇద్దరికి సమానమైన వాటర్‌ ఉండటంతో అయిదుగురు నామినేట్‌ అయ్యారు. లక్కీగా సోహెల్‌ మరియు అరియానాలు సేవ్‌ అవ్వగా మిగిలిన అయిదుగురు నామినేట్‌ అయ్యారు. నామినేషన్‌ సమయంలో అవినాష్‌ మరియు మోనాల్‌ మద్య జరిగిన సంభాషణ తారా స్థాయికి చేరింది. నేను నీ కంటే వీక్‌ అంటున్నావు. కాని ప్రేక్షకులు నిన్ను ఎలిమినేట్‌ చేసి నన్ను సేవ్‌ చేశారు అంటూ మోనాల్‌ అన్న సమయంలో అవినాష్‌ చాలా బాధ పడ్డాడు. ఇలాంటివి వస్తాయనే ఉద్దేశ్యంతో పాస్‌ వల్ల సేవ్‌ అయ్యాను అనే బాధ ఉందని అన్నాడు. అరియానా గురించి మోనాల్‌ మాట్లాడుతున్న సమయంలో తెలుగులో మాట్లాడాలంటూ అవినాష్‌ అన్నాడు. ఆ సమయంలో మోనాల్‌ మరింతగా రెచ్చి పోయింది. ఆమెను అఖిల్‌ మరియు అభిజిత్‌ లు నామినేట్‌ చేయడంను తట్టుకోలేక పోయింది. దాంతో ఆమె తట్టుకోలేక పోయింది. వారిపై కోపంతో ఎక్కిఎక్కి పడి ఏడ్చింది. అదే విధంగా అవినాష్‌ ను తిట్టేసింది.