ఫోటో మూమెంట్: తన పిల్లలతో ఎమోషనల్ మూమెంట్ ను షేర్ చేసుకుంటున్న పవన్

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లకు ఇద్దరు పిల్లలున్న సంగతి తెల్సిందే. అకిరా నందన్ మరియు ఆద్యా. అయితే కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోవడంతో పిల్లలు రేణు దేశాయ్ వద్దనే పెరుగుతున్నారు. అయితే ఇద్దరూ విడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ తన పిల్లలను కలుస్తూనే ఉంటాడు.

ఇదిగో ఈ ఫోటో మూమెంట్ అలా కలిసినప్పటిదే. రేణు దేశాయ్ ఈ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఎమోషనల్ మూమెంట్ ను షేర్ చేసుకుంటున్నాడు. పిల్లలిద్దరూ కూడా పవన్ ను కౌగలించుకుని ఉండడంతో ఈ ఫోటో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. తండ్రితో తమకున్న అనుబంధాన్ని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.

జనసేన పార్టీ వ్యవస్థాపకులైన పవన్ కళ్యాణ్ ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్.

మరోవైపు అకిరా ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయాడు. రీసెంట్ గా అకిరా ఫొటోస్ చూసి చాలా మంది షాక్ తిన్నారు. చాలా పొడుగ్గా చూడటానికి కూడా పెర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనిపించే విధంగా ఉన్నాడు అకిరా.