కమెడియన్ నుండి హీరోగా అటు నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా రూట్ మార్చుకున్న సునీల్, త్వరలోనే దర్శకుడు కాబోతున్నట్లు వెల్లడిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సునీల్ ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొంత కాలంగా సునీల్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. దీని కోసం విలన్ గా మారినా కానీ పెద్ద ఫలితం లేదు.
అయితే ఆహాలో విడుదలైన కలర్ ఫోటో మంచి హిట్ సాధించింది. ఇందులో విలన్ గా నటించాడు సునీల్. ప్రస్తుతం మరో ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం రూపొందుతున్న చిత్రంలో సునీల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి విఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకోగా అతి త్వరలోనే విడుదల కూడా చేయనున్నారు.
ఇదిలా ఉంటే సునీల్ ఇప్పుడు దర్శకత్వంపై కన్నేశాడని రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఒక మరాఠీ చిత్రాన్ని చూసి సునీల్ ఇంప్రెస్ అయ్యి దర్శకత్వం చేయాలని భావిస్తున్నాడట. ఇందుకోసం ఒక నిర్మాత కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కొనుగోలు చేసాడట.
సునీల్ తన టీమ్ తో కలిసి ఈ మరాఠీ చిత్ర కథను మన నేటివిటీకి తగ్గట్లుగా మార్చబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.