ప్రభాస్‌ అమాయకుడు.. అందుకే ‘సలార్‌’ను చేశానన్న ప్రశాంత్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తో సినిమాను ప్రకటించి సంచలనం సృష్టించిన ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ 2 ను ముగించే పనిలో ఉన్నాడు. ఇదే సమయంలో ప్రభాస్‌ తోనే ఎందుకు సలార్‌ ను చేస్తున్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్‌ సినిమాల్లో ఎంతో గంభీర్యంగా కనిపించినా కూడా సహజంగా అయితే అతడు చాలా అమాయకమైన ఫేస్‌ ను కలిగి ఉంటాడు. అందుకే ఆయన్ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నాడు. కేజీఎఫ్‌ సినిమాల్లో మించి క్రూరత్వం ఈ సినిమాల్లో చూపిస్తానంటూ ఉన్న ప్రశాంత్‌ నీల్‌ మరో వైపు ప్రభాస్‌ అమాయకపు పేసు వల్లే ఆయనతో ఈ సినిమను చేస్తున్నాను అంటూ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉండటంతో పాటు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

సలార్‌ అంటే అత్యంత దృడమైన నాయకుడు అని అర్థం. బలమైన రాజు.. సరైన రాజు అని కూడా సలార్‌ కు అర్థం వస్తుందంటున్నారు. సలార్‌ టైటిల్‌ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరి కొన్ని రోజుల్లో కేజీఎఫ్‌ కు గుమ్మడి కాయ కొట్ట బోతున్నాడు. ఈ నెలలో కేజీఎఫ్‌ 2 కు గుమ్మడి కాయ కొట్టి.. వచ్చే నెలలో సలార్‌ కు కొబ్బరి కాయ కొట్టించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇదే సమయంలో ప్రభాస్‌ కూడా తన తాజా సినిమా రాధేశ్యామ్‌ కు ఈ నెలలో గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందంటున్నారు.

కేజీఎఫ్‌ సినిమాతో ఆల్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాతో ఆయన స్థాయిని మరింతగా పెంచుకోవడంతో పాటు బాలీవుడ్‌ హీరోలు సైతం ఆశ్చర్యంగా తనవైపు చూసేలా చేసుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. సలార్‌ సినిమా కథ ప్రభాస్‌ కు మాత్రమే సెట్‌ అవుతుందన్నంత గా ప్రశాంత్‌ నీల్‌ వ్యాఖ్యలు చేస్తున్నాడు.