మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయ్ పూర్ లో భారీ ఎత్తున వివాహ వేడుకకు సిద్దం అయ్యారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అక్కడకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. నిన్నటి నుండే పెళ్లి వేడుకలు ఆరంభం అయ్యాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న నిహారికను పెళ్లి కూతురును కూడా చేశారు. ఇక ఈ పెళ్లి సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి కూతురు అయిన నిహారికు ఏం బహుమానం ఇచ్చాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
నిహారిక కోసం చిరంజీవి ఏకంగా రూ.1.5 కోట్ల విలువైన ఆభరణంను కానుకగా ఇచ్చాడట. అది మాత్రమే కాకుండా కాబోయే అల్లుడి కోసం కూడా ఖరీదైన బహుమానంను చిరంజీవి దంపతులు పెళ్లికి ముందే ఇచ్చేశారనే సమాచారం అందుతోంది. మొత్తానికి మెగా వేడుకకు అంతా సిద్దం అయ్యింది. చిరంజీవి దంపతులతో పాటు మొత్తం ఫ్యామిలీ కూడా ఉదయ్ పూర్ కు చేరుకోబోతున్నారు. ఇక నిహారిక దంపతులకు పవన్ నుండి అందబోతున్న కానుక ఏంటీ అనేది ఆసక్తిగా ఉంది. ఆయన పెళ్లికి హాజరు అవ్వడమే పెద్ద కానుకగా నిహారిక భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.