బిగ్ బాస్ 4: గంగవ్వకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోన్న నాగార్జున

అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 4కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఫినాలే ఎపిసోడ్ కూడా ఉంటుంది. బిగ్ బాస్ 4 కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అంటే గంగవ్వ అనే చెప్పాలి. 58 ఏళ్ల వయసులో గంగవ్వ బిగ్ బాస్ కు రావడం ఒక సంచలనమే.

ఆమె తెలంగాణ రూరల్ స్లాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గంగవ్వ అనారోగ్య కారణాలుగా షో మధ్యలో నుండే వెళ్ళిపోయింది కానీ లేదంటే ఇంకా ఉండి ఉండేదే. ఇక గంగవ్వ తనకు సొంత ఇల్లు కట్టుకోవడం కల అని పలు మార్లు చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంలో అక్కినేని నాగార్జున తనకు సొంత ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుకాబోతున్నాయని తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యంతో కలిసి నాగార్జున గంగవ్వ సొంత ఊర్లో కొత్త ఇంటిని నిర్మించి ఆమెకు ఇవ్వనున్నారు. మొత్తంగా సొంత ఇంటి కోసమే బిగ్ బాస్ కు వచ్చిన గంగవ్వ కోరిక తీరుతోందని చెప్పాలి.

బిగ్ బాస్ నుండి వచ్చాక ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో వీడియోస్ పోస్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే.