‘ఆహా’ మెగా గిఫ్ట్.. చిరంజీవితో సామ్ జామ్ టెలికాస్ట్ డేట్ ఫిక్స్..

తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ‘ఆహా’. సినిమాలతోపాటు పలు కార్యక్రమాల్లో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, రానా.. వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్ రివీల్ అయింది.

సామ్ జామ్ కార్యక్రమంలో భాగంగా ఈ మెగా ఇంటర్వ్యూను క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డిసెంబర్ 25న ప్రసారం చేయనున్నామని ఆహా యాజమాన్యం ప్రకటించింది. ఇందులో చిరంజీవి చేయబోయే ప్రాజెక్టులు, లాక్ డౌన్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు.. తదితర వివరాలను రివీల్ చేసారని సమాచారం. ఇటివల ఈ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి మేకోవర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది ‘ఆహా’.