మరింతగా క్షీణించిన దిలీప్ కుమార్ ఆరోగ్యం

బాలీవుడ్ సూపర్ స్టార్లలో దిలీప్ కుమార్ పేరు చిరస్మరణీయం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సతీమణి సైరా భాను తెలియజేసారు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దిలీప్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు భాను.

ఆవిడ చెప్పిన విషయాల ప్రకారం దిలీప్ లేచి నిలబడితే దేవుడికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నామని, తన గది నుండి హాల్ వరకూ రావడమే చాలా గొప్ప అన్నట్లుగా ఉందని సైరా తెలిపారు. వీరిద్దరూ ఈ ఏడాది 54వ వివాహ వేడుకను జరుపుకున్నారు. ఇక దిలీప్ ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అయ్యారు భాను. అభిమానులందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని అభ్యర్ధించారు.

ఆయన జీవిత చరమాంకంలో తోడుగా ఉంటోంది ప్రేమతోనే అని, మరొకటి ఆశించి కాదని ఆమె తెలియజేసింది. తన జీవితంలో అత్యంత అపురూపమైనది తనకు దిలీప్ మాత్రమేనని ఆమె అన్నారు. కరోనా వచ్చిన దగ్గరనుండి ఈ దంపతులు ఇద్దరూ ఐసోలేషన్ లోనే కాలం గడుపుతున్నారు. దిలీప్ అభిమానులందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.