బిగ్ బాస్ 4: రాహుల్, నోయెల్ ల పబ్లిసిటీ విడిపోయిందిగా

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. ఇక ఫైనల్ వీక్ కు కేవలం ఈ వారమే ఉంది. ఇప్పటికే అఖిల్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్స్ కు చేరిన విషయం తెల్సిందే. ఇక మిగిలిన ఐదుగురిలో నలుగురు ఫైనల్స్ కు వెళతారు. ఆ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

ఆఖరి వారం నామినేషన్స్ లో డ్రామా ఏం లేకుండా బిగ్ బాస్ ఐదుగురిని డైరెక్ట్ గా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే నామినేట్ అయిన సభ్యులు తమకు ఓటు వేయమని ప్రేక్షకులను అభ్యర్దించే అవకాశాన్ని ఇస్తానని తెలిపాడు. ఇందుకోసం రాజు-రాణి టాస్క్ ను ఆడించాడు.

ఇందులో భాగంగా అఖిల్ తప్ప మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు రాజు – రాణి అవుతారు. అందులో బాగా ఎంటర్టైన్ చేసిన వారికి ఓటు అభ్యర్ధించే అవకాశం లభిస్తుంది. ముందుగా సోహైల్ రాజు అవ్వగా ఆ తర్వాత అభిజీత్, ఆ తర్వాత హారిక రాణి అయింది. ఎవరి పరిధి మేరకు వారు బాగానే ఎంటర్టైన్ చేసారు. అయితే ఈ టాస్క్ లో అభిజీత్, హారికల మధ్య బాగా దూరం పెరిగినట్లు అర్ధమవుతోంది. దానికి తోడు అఖిల్, మోనాల్ లకు దగ్గరగా ఉంటోంది హారిక. ఇది అభిజీత్ ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేస్తోంది.

మరోవైపు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ నోయెల్ అభిజీత్, హారికలకు ఓటు వేయమని అభ్యర్ధించగా, బిగ్ బాస్ 3 విన్నర్. నోయెల్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం అరియనాకు ఓటు వేయమని కోరుతున్నాడు. అభిజీత్ కు ఎలాగు ఓట్లు పడతాయని కాబట్టి అరియానా లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ కు ఓట్లు వేయాలని తన 10 ఓట్లు అరియనాకు వేసి మరీ చూపించాడు.