తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెట్టబోతున్నాడు. ఇది చాలా కాలంగా వింటున్నదే. రెండు దశాబ్దాలుగా ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు పార్టీని పెట్టబోతున్నట్లుగా రజినీకాంత్ డేట్ ను కూడా ప్రకటించాడు. ఈనెల 31వ తారీకున పార్టీని ప్రారంభించి వచ్చే ఏడాదిలో తమిళ ప్రజల కష్టాలను తీర్చబోతున్నట్లుగా రజినీకాంత్ ఇప్పటికే ప్రకటించాడు. రజినీకాంత్ వరుసగా అభిమానులతో చర్చిస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో రజినీకాంత్ పార్టీ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీని రిజిస్ట్రర్ చేసేందుకు రజినీకాంత్ వెళ్లాడని తెలుస్తోంది. పలువురు రజినీకాంత్ అభిమాన సంఘం నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు కూడా ఢిల్లీలో రజినీతో ఉన్నారు. పార్టీ గుర్తు మరియు విధి విధానాలు ఇతర విషయాల గురించి రజినీకాంత్ మరోసారి తన అభిమాన సంఘం నాయకులతో చర్చించబోతున్నారు. ఎన్నికల సంఘం వద్ద పార్టీని రిజిస్ట్రర్ చేసిన సమయంలో అన్ని విషయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే కార్యక్రమంను రజినీకాంత్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.