తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజాల్లో రామానాయుడు ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమా గురించి మరో అయిదు వందల సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నా కూడా రామానాయుడు గారి ప్రస్థావన లేకుండా మాత్రం ఆ ముచ్చట ఉండదు, చరిత్ర ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా రామానాయుడు గురించి మాట్లాడుకోవడంతో పాటు ఆయన కుటుంబం గురించి కూడా మాట్లాడేలా ఆయన వారసులు చేశారు. సురేష్ బాబు నిర్మాతగా తెలుగు సినిమాను ఓ రేంజ్ లో నిలిపితే వెంకటేష్ హీరోగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇదే సమయంలో రానా కూడా హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
తాత రామానాయుడు పేరును షార్ట్ కట్ లో రానా అంటూ పెట్టుకున్న ఈ యంగ్ హీరో మల్టీ ట్యాలెంటెడ్ అంటూ అందరికి తెల్సిందే. కేవలం తెలుగులో హీరో పాత్రలకే పరిమితం అవ్వకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న రానా విలన్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రానా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అరుదైన హీరో అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుత యంగ్ హీరోల్లో అతి తక్కు మందికి మాత్రమే పాన్ ఇండియా గుర్తింపు ఉంది. అందులో రానా ఒకరు అనడంలో సందేహం లేదు.
లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత సక్సెస్ ప్లాప్ లతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేయాలి.. ప్రేక్షకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో మంచి సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. బాహుబలిలో ఆయన భల్లాలదేవుడి పాత్రలో నటించి విలన్ అంటే ఇలా ఉండాల్రా అన్నట్లుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విరాట పర్వం సినిమా చేస్తున్నాడు. ఈయన నటించిన అరణ్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. పవన్ కళ్యాణ్ తో ఒక మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. అనారోగ్య కారణాల వల్ల కాస్త బ్రేక్ ఇచ్చిన రానా మళ్లీ ఫుల్ స్వింగ్ లో ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నాడు.
నేడు ఈ భల్లాలదేవుడి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు మా తరపున మీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్నో విభిన్న చిత్రాలను చేసి మల్టీ ట్యాలెంట్ తో ఇంకా రానా ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్ డే రానా.