బిగ్ బాస్ 4: ఫినాలే కోసమే ప్రేక్షకుల ఎదురుచూపులు

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 ఎండ్ కు చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ వీక్ నడుస్తోంది. హౌజ్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఒక్కరు విజేతలుగా నిలుస్తారు. కరోనా పరిస్థితుల మధ్యలో కూడా బిగ్ బాస్ ను నిర్వహించారు. ఈ విషయం మెచ్చుకోతగిందే. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ 4 మొదట్లో బాగానే సందడి చేసింది. కంటెస్టెంట్లలో పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోయినా కానీ బిగ్ బాస్ టాస్క్ ల విషయంలో ఆసక్తికరంగా మలచడంతో మొదట్లో టీఆర్పీలు బాగానే వచ్చాయి.

అయితే ఆ హైప్ ను నిలపడంలో బిగ్ బాస్ మానేజ్మెంట్ విఫలమైందనే చెప్పాలి. క్రమంగా షో కు దక్కుతున్న ఆదరణ తగ్గింది. ఇక ఇప్పుడు ఫైనల్ వీక్ లో ఉంది ఈ షో. ఇక ఫైనల్ వీక్ లో టాస్క్ లు మరీ చప్పగా సాగుతున్నాయి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే సరిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు షో పై నీరసం వస్తోంది. కేవలం ఫైనల్ ఎపిసోడ్ కోసమే వాళ్ళు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ ఎపిసోడ్ లో ఉండే హంగామా వేరుగా ఉంటుందన్న విషయం తెల్సిందే.

చిరంజీవి ఫైనల్ ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నాడు. మరి అభిజీత్, అఖిల్, సోహైల్, అరియనా, హారికలలో ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారో చూడాలి.