ఈరోజంతా బిగ్ బాస్ సందడే మెయిన్ గా ఉండనుంది. గత 104 రోజులుగా సాగుతోన్న బిగ్ బాస్ సీజన్ 4 ఈరోజుతో ముగుస్తుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో నుండి ఒక్కరు విజేతగా నిలవనున్నారు. విజేత ఎవరు అనే విషయంలో ఇప్పటికే పూర్తి క్లారిటీ జనాలకు వచ్చేసింది. మిగిలిన స్థానాల్లో ఎవరు నిలుస్తారు అన్నది ప్రధానంగా ఉండనుంది.
ఈ సందర్భంగా ఈరోజు జరగబోయే ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే విడుదలైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ తమ తమ పెరఫార్మన్స్ లతో సందడి చేయనున్నారు. అలాగే చాలా మంది స్టార్స్ కూడా విచ్చేసారు. అనిల్ రావిపూడి, మెహ్రీన్, లక్ష్మి రాయ్, ఎస్ ఎస్ థమన్.. ఇలా సెలబ్రిటీలకు కొదవ లేదు. అనిల్ రావిపూడి, మెహ్రీన్ ఇంట్లోకి వెళ్లి ఒక కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొస్తారు.
ఇక చాలా మంది ఆట పాటలతో బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ అదిరిపోవడం ఖాయం.