అనివార్య పరిస్థితుల్లో ప్రియుడికి దూరంగా నయన్… కారణమిదే!

నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సంగతిని నయన్ ఎప్పుడో బయటపెట్టింది. ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా గడిపిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంది. అలాగే కోవిద్ పరిస్థితుల మధ్య కూడా వీరిద్దరూ కలిసే ఉన్నారు. నిబంధనలను పాటిస్తూనే నయన్, విగ్నేష్ శివన్ కలిసి లాక్ డౌన్ లో గడిపారు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు లేకపోయినా నయన్, విగ్నేష్ ను దూరం పెట్టక తప్పలేదు. ప్రస్తుతం నయన్ హైదరాబాద్ లో ఉంది. రజినీకాంత్ హీరోగా అన్నాతే షూటింగ్ లో నయన్ పాల్గొంటోంది. అలాగే విగ్నేష్ శివన్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు. కాథు వాకులా రెండు కధల్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోనే సాగుతోంది. ప్రస్తుతం సమంత షూటింగ్ లో పాల్గొంటోంది.

రజిని సినిమా షూటింగ్ స్పాట్ లో కఠినమైన నిబంధనలను అమలుపరిచారు. షూటింగ్ స్పాట్ లోపలికి బయట వారు రావడానికి లేదు. లోపలి వారు బయటకు వెళ్ళడానికి లేదు. అందుకే నయన్, విగ్నేష్ శివన్ లకు ఎడబాటు తప్పట్లేదు.