సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

సడెన్ గా ఇప్పుడు సంక్రాంతి పండక్కి రష్ ఎక్కువైపోయింది. ఇటీవలే థియేటర్లో తిరిగి తెరుచుకున్న విషయం తెల్సిందే. 50 శాతం ఆక్యుపెన్సీతోనే అయినా ఇటీవలే విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ బాగానే పెర్ఫర్మ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా నిర్మాతలకు ధైర్యం వచ్చింది.

ఇప్పటికే సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా కూడా రేసులోకి వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది.

తాజాగా చిత్ర టీమ్ జనవరి 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. నభ నటేష్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

మరి అసలే విపరీతమైన పోటీ మధ్య అందులోనూ కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.