రామ్ గోపాల్ వర్మ తన తర్వాతి సినిమాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద తీయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. జగన్ అవినీతిపై వర్మ సినిమా తీస్తే తాను నటిస్తానని.. తాను కూడా నటుడినేనని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరుగుతోందని దానిపై వర్మ సినిమా తీయాలని కోరారు. విశాఖలో సోమవారం నాడు మీడియాతో ఆయన మాట్లాడారు.
ఆ సినిమాకు ‘అల వైఎస్ అవినీతి పురములో’ అనే టైటిల్ పెట్టాలని కూడా సూచించారు బండారు. జగన్ ను బాగా స్టడీ చేశానని ఆయన పాత్రలో బాగా నటిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు. అవినీతి కూడా జగన్ బాగా చేస్తున్నారని.. అదంతా తనకు తెలుసని అన్నారు. వర్మ అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా అన్నారు.