లూసీఫర్‌ రీమేక్ లో ఈ యంగ్ హీరో కన్ఫర్మ్‌

చిరంజీవి నటించబోతున్న లూసీఫర్ రీమేక్ కోసం నటీనటుల ఎంపిక జరుగబోతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ రీమేక్‌ లో కీలక పాత్రకు గాను యంగ్ హీరో సత్యదేవ్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్‌ ఒరిజినల్ వర్షన్‌ లో వివేక్‌ ఒబేరాయ్ పోషించిన పాత్రను సత్యదేవ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చడం జరిగింది. అందులో భాగంగా ఆ పాత్రను కూడా మార్చారట. సత్యదేవ్‌ అయితే ఆ పాత్రకు బాగా సూట్ అవుతాడని మెగా కాంపౌండ్‌ భావించిందని తెలుస్తోంది.

తన అభిమాన హీరో నటించబోతున్న లూసీఫర్‌ రీమేక్ లో తనకు ఛాన్స్ రావడం పట్ల సత్యదేవ్‌ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఈ నెల చివరి వరకు పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లూసీఫర్‌ రీమేక్‌ లో కీలకమైన పాత్రకు గాను సీనియర్ హీరోయిన్ ను నటింపజేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి లూసీఫర్‌ రీమేక్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల వారిలో చర్చనీయాంశంగా మారింది. ఆచార్య షూటింగ్ ముగిసిన వెంటనే లూసీఫర్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది.