టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సామ్ జామ్ టాక్ షో సీజన్ 1 ముగింపు దశకు చేరుకుంది. నాగచైతన్యతో ఈ వారం సమంత సామ్ జామ్ టాక్ షో ఉండబోతుంది. దాంతో షో సీజన్ పూర్తి అవ్వబోతుంది. ఆ విషయాన్ని నాగచైతన్య కూడా క్లారిటీ ఇచ్చాడు. చైతూ సామ్ జామ్ టాక్ షో ప్రోమో విడుదల చేశారు. చైతూ మరియు సమంతల ముచ్చట్లు చాలా సరదాగా ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా విషయాలను ఎంటర్ టైన్ మెంట్ తో చర్చించుకున్నట్లుగా ప్రోమోలో తెలుస్తోంది.
ఇంట్లో ఉంటాడు ఎప్పుడైనా వచ్చేస్తాడులే అని చివర్లో పిలిచావా అంటూ సమంతపై పంచ్ లు వేశాడు. ఇక నా వంటకు ఎన్ని మార్కులు ఇస్తావు అంటూ సమంత ప్రశ్నించగా ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఇక నువ్వు కాలేజ్ కు వెళ్లి కూర్చోనే లేదు నా గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటూ సమంత పైనే చైతూ పంచ్ లు వేసి మస్త్గా నవ్వించాడు. మొత్తానికి సామ్ జామ్ సీజన్ 1 చివరి ఎపిసోడ్ మస్త్ ఎంటర్ టైన్మెంట్ ను అందించబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.