ఏడేళ్ల తర్వాత యాంకర్‌ రవి మళ్లీ ఆ షో

యాంకర్‌ రవి అనగానే చాలా మందికి లాస్య గుర్తుకు వస్తుంది. అంటే ఈమద్య ఇద్దరు కాస్త ఎడం అయ్యారు కాని ఒక అయిదు సంవత్సరాల పాటు వీరిద్దరు కలిసి షోలు చేసేవారు. ఎక్కడ షో ఉన్నా కూడా యాంకర్‌ లుగా రవి లాస్యలు మాత్రమే ఉండే వారు. ఇద్దరు కలిసి చేస్తేనే ఆ షోకు కిక్‌ ఉంటుంది అనేవారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇద్దరు కలిసి గతంలో లైవ్‌ షోలు చేశారు. ఆ తర్వాత హోస్టింగ్‌ లు చేశారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా రవి లైవ్ షో లకు యాంకర్‌ గా వ్యవహరించడం మానేశాడు.

ఎక్కువ శాతం రికార్డెడ్‌ షోలు మాత్రమే హోస్ట్‌ చేస్తూ వస్తున్నాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు యాంకర్‌ రవి ఒక ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఛానెల్‌ లైవ్‌ షో కోసం యాంకర్‌ గా చేసేందుకు సిద్దం అయ్యాడు. అది ఒక నాలెడ్జ్‌ షో అవ్వడంత అంతా కూడా చాలా ఆసక్తిగా రవి షో కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రోమోలు కూడా వచ్చేశాయి. సోషల్‌ మీడియాలో హడావుడి కనిపిస్తుంది. ఈ సమయంలోనే రవి మళ్లీ లాస్యతో కూడా కలిశాడు. మాటీవీ షో లో రవి లాస్యలు కలిశారు. కనుక మళ్లీ వీరిద్దరు లైవ్‌ షో చేస్తారేమో చూడాలి.