నేను చిన్నారిని కాదు.. బికినీలో అవికాగోర్.. మంటలు పుట్టిస్తోందిగా..


‘అవికాగోర్..’ అనగానే అందరి మనసులో మెదిలేది ‘చిన్నారి పెళ్లికూతరే’. మరికాస్త థింక్ చేస్తే.. నిండైన బొద్దుగుమ్మ కనిపిస్తుంది. కానీ.. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన తన పిక్ చూస్తే.. యూత్ కి పిచ్చెక్కడం ఖాయం! ఏకంగా.. టూ పీస్ బికినీతో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజ్ ను చూసిన వారికి మైండ్ బ్లాంక్ అవుతోంది. బ్లూ కలర్ బికినీలో.. బ్లూయీష్ గా కనిపిస్తున్న నీటి ఒడ్డున పడుకొని అవికా చూపిస్తున్న అందాలు కుర్రకారు మతులు పోగొడుతోంది. ‘ఏంటి.. ఈమె ఆమేనా..?’ అని నోరెళ్లబెడుతున్నారు చాలా మంది.

సిల్వర్ స్క్రీన్ పై.. సిల్వర్ జూబ్లీ సినిమా లెక్క ఆడాలంటే ఒకే పాత్రలో సెట్టైపోతే కుదరదు మరి! హీరోయిన్ గా ఎదగాలనుకుంటే అస్సలే కుదరు. తెరపై అందాలు ఆరబోయాలి.. హీరోతో ఘాటు రొమాన్సులు చేయాలి. అప్పుడే జనాల నోళ్లలో నానుతారు. నాలుగు ఛాన్స్ లు చెంతకొస్తాయి. సో.. ఇలాంటి క్యారెక్టర్లకు నేను రెడీ అన్నట్టుగా.. లేటెస్ట్ పిక్ రిలీజ్ చేసింది ఈ హోమ్లీ బ్యూటీ.

తెలుగులో ఉయ్యాలా జంపాలా సినిమా చూపిస్త మావా రాజుగారి గది-3 సినిమాల్లో నటించిన అవికా.. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఈ మూడు చిత్రాల్లోనూ పక్కింటి అమ్మాయిలా సంప్రదాయ బద్ధమైన గెటప్ లో కనిపించింది. ఇలాగే కంటిన్యూ అయితే కెరీర్ కే మోసం వస్తుందని భావించిందో ఏమోకానీ.. ఏకంగా బికినీ వేసి తనలోని మరో యాంగిల్ బయటపెట్టింది. అవికా పోస్ట్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. మరి ఇకనైనా ఈ అమ్మడికి అవకాశాలు ఎంతమేర తలుపు తడతాయో చూడాలి.