మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికల ముందు హత్యకు గురి అయిన విషయం తెల్సిందే. రాజకీయ హత్య అంటూ చాలా మంది బలంగా చెబుతున్నారు. మొదట ప్రభుత్వం ఈ హత్య కేసును పోలీసులు విచారిస్తారు అంటూ చెబుతూ వచ్చారు. అయితే రాజకీయ ఒత్తిడి మరియు వివేకానందా రెడ్డి కూతురు సునీత కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం సీబీఐకి కేసును అప్పగించాల్సి వచ్చింది.
ప్రస్తుతం సీబీఐ వారు కేసును విచారిస్తున్నారు. కాని ఎలాంటి పురోగతి లేదు. ఇలాంటి సమయంలో తన తండ్రి హత్య కేసు విషయంలో సాయం చేయాలంటూ ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన జోమున్ పుతెన్ పురక్కల్ ను కలిశారు. కేరళకు చెందిన ఈయన ఎన్నో కేసులకు సంబంధించిన విషయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. పోరాటం చేసేందుకు ఈయన వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. అందుకే సునీత ఈయన్ను కలిసి సలహా కోరారు. ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాన్ని ఆయన దిశ నిర్థేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ రాజకీయ ప్రాచుర్యంను సంతరించుకుంది.