ప్రభాస్ సలార్ లో ఆ బాలీవుడ్ హాటీ కన్ఫర్మ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాను కంప్లీట్ చేసి ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్ మొత్తం సలార్ పై పెట్టిన విషయం తెల్సిందే. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటాడని అధికారికంగా తెలిసింది.

కేజిఎఫ్ తో స్టార్ దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ లో హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను కన్ఫర్మ్ చేశారట.

తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల్లో నటించిన కత్రినా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సౌత్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. 2021లోనే సలార్ ను విడుదల చేయాలని ప్లానింగ్ జరుగుతోంది.