పెళ్లి విషయమై మళ్లీ క్లారిటీ ఇచ్చిన బిబి అఖిల్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 4 తో అందరి దృష్టిని ఆకర్షించిన అఖిల్‌ సార్థక్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో రెడీ అవుతున్నాడు. విలన్ గా మంచి గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నాడు. అఖిల్ మొదటి నుండి కూడా మోనాల్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చాడు. ఆమెతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరి వయసు తేడా చాలా ఉంది. పైగా ఆమె వయసు ఎక్కువ అంటూ వార్తలు వచ్చాయి. అయినా కూడా ఆమెను అఖిల్‌ పెళ్లి చేసుకుంటాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ సీజన్‌ 4 ముగిసిన తర్వాత అఖిల్ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ అయ్యాడు. రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా లో అభిమానులతో చిట్ చాట్‌ చేస్తున్నాడు. ఈ సందర్బంగా ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు పెళ్లిపై చాలా క్లియర్‌ గా అభిప్రాయం ఉంది. ప్రేమించిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేమించిన అమ్మాయి అయితేనే అర్థం చేసుకుంటుంది అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కనుక జీవితంలో ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందని ఈ సందర్బంగా అఖిల్‌ చెప్పుకొచ్చాడు. మరి మోనాల్‌ ను పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు.