మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ దిశా పటాని గుర్తుంది కదా. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. యంగ్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం ఈమె మోస్ట్ వాంటెడ్ గా ఉంది. ఇలాంటి సమయంలో ఈమెను చంపేస్తామంటూ కొందరు కాల్ చేసి బెదిరిస్తున్నారు. ఆమెకు పర్సనల్ కాల్స్ రావడంతో పాటు ఆమె నివాసం ఉంటున్న ఏరియా పోలీసులకు కూడా కాల్స్ వస్తున్నాయి. చంపేసి తీరుతాం ఎలా కాపాడుతారో కాపాడుకోండి అంటూ పోలీసులను ఛాలెంజ్ చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కాల్స్ ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయాలను గుర్తించే పనిలో పడ్డారు. ఆ కాల్స్ పాకిస్తాన్ నుండి వచ్చాయని, అవి ఇంటర్నెట్ కాల్స్ అంటూ నిర్థారించారు. అక్కడ ఎవరికి దిశా పటానిని చంపే అవసరం ఉంది. ఖచ్చితంగా వారు ఎవరో నెట్ వర్క్ ను హ్యాక్ చేసి పాకిస్తాన్ నుండి కాల్ చేసినట్లుగా మాట్లాడుతున్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దిశా ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. ఎంక్వౌరీ వేగవంతం చేయడంతో పాటు ఆమెకు సెక్యూరిటీ కల్పించామని పోలీసులు తెలియజేశారు.