సునీత పిల్లలకు ఫెవరెట్ సింగర్ ఆమె కాదా?

సునీత సింగర్ గా బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆమె రెండో వివాహం విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మ్యాంగో మీడియాకు చెందిన రామ్ ను ఆమె రెండో వివాహం చేసుకుంది. దీనికి తన పిల్లలు ఎంతో సంతోషంగా అంగీకరించడం తన అదృష్టమని తెలిపింది. సునీతకు ఎదిగొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారు.

ఇక యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఆ పాటను సిద్ శ్రీరామ్, సునీత పాడారు. ఈ వేడుకకు తన పిల్లలతో కలిసి వెళ్లిన సునీత సిద్ శ్రీరామ్ తో ఫోటో దిగింది.

సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో తన పిల్లలతో సిద్ శ్రీరామ్ దిగిన ఫోటోను షేర్ చేసింది. వాళ్ళ ఫేవరేట్ సింగర్ తో ఫోటో అంటూ క్యాప్షన్ ను జత చేసింది. దీనికి అందరూ అయితే సునీత వాళ్ళ ఫెవరెట్ కాదా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.