సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌!

‘రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్‌’, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా… ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాలు. అన్నీ ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లే. మరో రెండుమూడేళ్ల వరకూ ప్రభాస్‌ ఫుల్‌ బిజీ. కానీ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. హృతిక్‌ రోషన్‌తో ‘బ్యాంగ్‌ బ్యాంగ్, వార్‌’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ భారీ యాక్షన్‌ చిత్రం చేయబోతున్నారట. దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయట. ప్రస్తుతం ప్రభాస్, సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమా కమిట్‌మెంట్స్‌ పూర్తయ్యాక వీళ్ల కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని బాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌తో ‘పతాన్‌’ తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్‌. దీని తర్వాత హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ తెరకెక్కిస్తారు. ఆ తర్వాత ప్రభాస్‌తో చేసే సినిమా ఉంటుందని భోగట్టా.