సంక్రాంతికి సర్కారు వారి పాటను పాడనున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు. కొన్ని రోజుల క్రితమే మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ మొదలైంది. దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. అందరూ రిలీజ్ డేట్లను లాక్ చేస్తున్న తరుణంలో సర్కారు వారి పాట టీమ్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించేసారు.

మరోసారి సూపర్ స్టార్ సంక్రాంతికి సందడి చేయనున్నాడు. సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కూడా నిర్మాణంలో పాలు పంచుకోనుంది.

ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న విషయం తెల్సిందే. సర్కారు వారి పాట బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది.