షూటింగ్ తో పిల్లలకు దూరమై ఎమోషన్ అయిన బన్నీ..!

బన్నీ తన ఫ్యామిలీతో ఎంత ఎంజాయ్ చేస్తాడో తెలిసిన విషయమే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అయాన్, అర్హలతో ఎక్కువగా స్పెండ్ చేస్తూంటాడు. అర్హ ముద్దులొలికే మాటలను పలికిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో ఆనందాన్ని పంచుకుంటాడు. అయాన్ అల్లరిని కూడా అలానే ఎంజాయ్ చేస్తూంటాడు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం మారేడుమిల్లి, కేరళ అడవుల్లో షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ సందర్భంగా పిల్లలకు దూరమవుతున్నాడు. ఈ సందర్భంగా పిల్లలపై ఉన్న బెంగను వారి పిక్స్ ద్వారా చెప్పుకుంటున్నాడు. అర్హ ముద్దుమాటలతో.. ‘బెండకాయ్.. దొండకాయ్.. నువ్ నా గుండెకాయ్’ అంటూ పలికిన వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి మురిసిపోతున్నాడు. ఐ మిస్ యూ అర్హ అంటూ వీడియోను పోస్ట్ చేసి తన బెంగను చెప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.