బిగ్ బాస్ 5 ఫస్ట్ కంటెస్టెంట్ ఇతడే అంటున్నారే!

బిగ్ బాస్ సీజన్ 4 కరోనా పరిస్థితులకు ఎదురొడ్డి భారీ విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సీజన్ లో అభిజీత్ విన్నర్ గా నిలవగా రికార్డు టీఆర్పీలు సాధించింది. ఇక సీజన్ 4 ఆలస్యంగా మొదలవ్వడంతో సీజన్ 5 ను త్వరగా మొదలుపెట్టాలని భావిస్తున్నారు. మరో రెండు నెలల్లో బిగ్ బాస్ 5 మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

అయితే దీనికి సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, పలువురి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బిన్ 5కు కన్ఫర్మ్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ ఇతడే అంటూ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పేరు వినపడుతోంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ తో షణ్ముఖ్ చాలా ఫేమస్.

రీసెంట్ గా సాఫ్ట్ వేర్ డెవ్ లవ్ పర్ సిరీస్ తో ఫుల్ ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్. ఈ వెబ్ సిరీస్ ప్రతీ ఎపిసోడ్ దాదాపు 10 మిలియన్ వ్యూస్ ను సాధించడం విశేషం. మరి నిజంగానే షణ్ముఖ్ బిగ్ బాస్ కు ఎంపికయ్యాడో లేదో తెలియాల్సి ఉంది.