పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో యంగ్‌ హీరో


ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించి ప్రస్తుతం దర్శకుడిగా కొనసాగుతున్న ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్‌ చాలా కాలంగా హీరోగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. హీరోగా ఇప్పటి వరకు సరైన కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయిన సుమంత్‌ అశ్విన్‌ సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక సుమంత్ అశ్విన్‌ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేయబోతున్నాడు. ఈనెల 13వ తారీకున దీపిక అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసేందుకు సిద్దం అయ్యాడు.

ఇరు కుటుంబాలు సుమంత్‌ అశ్విన్‌, దీపికల వివాహంకు హైదరాబాద్ లోని ఒక కన్వెన్షన్‌ లో ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈమద్య కాలంలో వరుసగా హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అదే దారిలో సుమంత్‌ అశ్విన్‌ కూడా పెళ్లి కొడుకు అయ్యేందుకు సిద్దం అయ్యాడు. కరోనా కారణంగా ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తోంది. 13వ తారీకున పెళ్లి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీపిక గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.