నీలి నీలి ఆకాశం పాట వెనుక కథ ఇదన్నామాట

ప్రదీప్‌ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలి నీలి ఆకాశం సినిమా సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే. ఆ పాటను చంద్రబోస్‌ రాసిన విషయం తెల్సిందే. తాజాగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ ఈ పాటను రాసిన సమయంలోనే ఫీమేల్ వాయిస్ ను సింగర్‌ సునీత పాడితే బాగుంటుందని అనుకున్నాను. ఆమెను తీసుకోవాలంటూ నేరు ముందే సంగీత దర్శకుడికి చెప్పాను. ఆమెపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. పాట సూపర్‌ హిట్‌ అవ్వడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

ఈ పాట సునీత భర్త రామ్‌ వీరపనేనికి కూడా బాగా ఇష్టం. ఆమె తరచు ఇలాంటి పాటలను ఎంపిక చేసుకోవాలని పాడాలని ఆయన సూచించాడు. ఆ పాట యూట్యూబ్‌ లో రికార్డు స్థాయి వ్యూస్ ను దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఒక మంచి పాటకు అన్ని సెట్‌ అవ్వడం వల్ల ఇలా హిట్ అయ్యింది. సింగర్ గా సునీతను పాడించాలనే ఉద్దేశ్యంతో సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్ తో సైతం గొడవ పెట్టుకునేందుకు నేను సిద్దం అయ్యాను అంటూ చంద్రబోస్ అన్నారు. ఒక రచయిత ముందే ఆ పాట హిట్ అవ్వాలంటే ఏ సింగర్‌ అయితే బాగుంటుందనే విషయాన్ని నిర్ణయించగడలని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.