చిరు కోసం ఆ ఇద్దరు స్టార్‌ హీరోయిన్స్‌ లో ఒక్కరు

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా ముగింపు పనుల్లో బిజీగా ఉన్నాడు. మార్చి వరకు సినిమా షూటింగ్ ను ముగించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తదుపరి సినిమా లూసీఫర్‌ రీమేక్ ఉంటుంది. ఆ మూవీ షూటింగ్ ముగియకుండానే బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో ఒక సినిమాను చిరంజీవి చేయబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం హీరోయిన్‌ ఎంపిక చర్చ జరుగుతోంది.

శృతి హాసన్ మరియు రకుల్ ప్రీత్‌ సింగ్ లను చిరంజీవి సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మేకప్‌ టెస్ట్‌ మరియు ఫొటో షూట్‌ చేసి ఆ తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది. చిరంజీవికి జోడీగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎంత వరకు సెట్‌ అవుతారు అనేది కొందరి అనుమానం. కాని ఈమద్య కాలంలో ఎంత సీనియర్‌ హీరోలు అయినా కూడా ఇలాంటి యంగ్‌ హీరోయిన్స్‌ తోనే రొమాన్స్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి కూడా ఇలా రొమాన్స్ చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శృతి హాసన్‌ తో ఇప్పటికే పవన్‌ మూడు సినిమాలకు చేశాడు. కనుక చిరంజీవి ఆమెతో వెళ్తాడా లేదంటే రకుల్‌ ప్రీత్‌ తో సినిమాకు సిద్దం అవుతాడా అనేది చూడాలి.