అల్లు అర్జున్ కోసం సౌత్ ఇండియా క్రేజీ డైరెక్టర్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప‘. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. అది ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అనే దానిపై ఇప్పటికే చాలా డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎవరికీ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అతనే పవర్ఫుల్ పోలీస్ స్టోరీస్ మరియు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ చెప్పే గౌతమ్ మీనన్. ప్రొడక్షన్ పరంగా లీగల్ గా ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల వలన ఈ మధ్య అయన చేసిన సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ కాక హోల్డ్ లో ఉన్నాయి. దాంతో ఆయన రూట్ మార్చి యాక్టర్ గా బిజీ అయిపోయారు.

తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మైండ్ లో పెట్టుకొని ఓ పర్ఫెక్ట్ పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఫిల్మ్ ని సిద్ధం చేశారట. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కాస్త ఫ్రీ అవ్వగానే కలిసి స్టోరీ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్ – గౌతమ్ మీనన్ కలిస్తే ఓ సూపర్ స్టైలిష్ కాప్ డ్రామా మనం చూడచ్చు.. ఈ కాంబినేషన్ పై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి.