షర్మిల పార్టీ ప్రకటనపై మంత్రి హరీశ్ సెటైర్లు..!

తెలంగాణ లో షర్మిల కొత్త పార్టీ ప్రకటనపై మంత్రి హరీశ్ స్పందించారు. ‘ఎవరో వచ్చి తెలంగాణ గురించి.. ఇక్కడి రైతుల గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉంది. తెలంగాణ గురించి వారికేం తెలుసు’ అని అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు మంత్రి హరీశ్. బుధవారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో ఎకరానికి 10వేలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకూ ఇస్తున్నాం. రైతుబంధు పథకంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంది. ఇక్కడికొచ్చి వారు ముసలి కన్నీరు కారుస్తున్నారు’ అని హరీశ్ అన్నారు.