రేవంత్ రెడ్డి పాదయాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉందా..!?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఇంత హఠాత్తుగా ఆయన పాదయాత్ర చేయడానికి వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడేందుకే హఠాత్తుగా పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. తనకు బాగా పట్టున్న అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు ఈ పాదయాత్ర చేపట్టారు.

కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవికి ప్రకటించేలోపు రేవంత్ రెడ్డి ఈ పాదయాత్ర పూర్తి చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ఈ పదవి రేవంత్ కు ఇస్తారనే ఊహాగానాలు రావడం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి ప్రతిఘటన ఎదురవడం.. అధిష్టానం వెనకడుగు వేసి నిర్ణయాన్ని వాయిదా వేయడం తెలసిన విషయమే. వైఎస్ తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేయని పనిని తాను చేసి అధిష్టానం దృష్టిని ఆకర్షించి పదవిని పొందేందుకే ఈ పాదయాత్ర చేపట్టారని అంటున్నారు.