ఫిబ్రవరి 21న సర్కారు వారి పాట స్పెషల్ ట్రీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేసారు. ఇక కొంత విరామం తర్వాత సెకండ్ షెడ్యూల్ కూడా అక్కడే కొనసాగుతోంది.

టీమ్ నుండి బ్రేక్ తీసుకున్న కీర్తి సురేష్ మళ్ళీ దుబాయ్ చేరుకుంది. రేపటి నుండి ఆమె షూటింగ్ లో పాల్గొంటుంది. ఫిబ్రవరి 21తో ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ మహేష్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ షూటింగ్ లో జరిగిన విశేషాలను ఒక స్పెషల్ వీడియోలా రూపొందించి విడుదల చేయనున్నారట. పరశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.