వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకు వెళ్తున్న ఈ సినిమాను హిందీ మరియు తమిళంలో రీమేక్ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాను హిందీ మరియు తమిళంలో రీమేక్ చేయగా అక్కడ సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. అక్కడ ఈ రెండు సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
హిందీలో ఈ సినిమాను ఇషాన్ కట్టర్ మరియు అనన్య పాండే జంటగా రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు తమిళంలో ఈ రీమేక్ తో సూపర్ స్టార్ విజయ్ తనయుడు ను హీరోగా పరిచయం చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయట. భారీ అంచనాలున్న ఈ సినిమా రీమేక్ విషయంపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదట హిందీలో రీమేక్ పట్టాలెక్కనుండగా తమిళంలో కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రెండు సినిమాలు కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.