యంగ్ హీరోలందు నాచురల్ స్టార్ నాని వేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ఏకంగా మూడు లేదా నాలుగు సినిమాలను తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. గత ఏడాది ఓటీటీ ద్వారా ‘వి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నాని ఆ సినిమా తో నిరాశ పర్చాడు. మ్యాజిక్ నెంబర్ 25వ సినిమాగా వి చేసిన నాని ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ మరియు అంటే సుందరాకిని సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
గత ఏడాది వృదా అయినందుకు ఈ ఏడాదిలో యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. నాని నాని మాత్రం అనుకోవడంతో పాటు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈయన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసుకోబోతున్నాడు అనిపిస్తుంది అంటూ అభిమానులు అంటున్నారు. నేడు నాని బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో హడావుడి కనిపిస్తుంది. శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ మరియు టక్ జగదీష్ ట్రైలర్ లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ బర్త్ డే నానికి ప్రత్యేంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో నాని ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు. నానికి ఈ సందర్బంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.