ఉప్పెన దర్శకుడి నెక్స్ట్ స్క్రిప్ట్ ఎవరికోసం?

ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు దర్శకుడు బుచ్చి బాబు. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి.

ఉప్పెన దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. వరస ప్రమోషనల్ యాక్టివిటీస్ నుండి బుచ్చి బాబు ఇప్పుడు బ్రేక్ తీసుకోనున్నాడు. హాలిడేకు వెళ్లి వచ్చిన తర్వాత బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వనున్నాడు.

ఉప్పెన చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బుచ్చి బాబుతో రెండో సినిమాకు కూడా డీల్ సెట్ చేసుకున్నారు. ఒక పెద్ద స్టార్ తో బుచ్చి బాబు డైరెక్ట్ చేయాలని మైత్రి సంస్థ భావిస్తోంది. ఎన్టీఆర్ నుండి ఇప్పటికే కమిట్మెంట్ ఉంది కానీ ఇప్పుడు ఫుల్ బిజీ. మరి ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.