‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘థ్యాంక్యూ’. ఇది చైతు 20వ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరిలో జరుపుకుంటోంది. దీంతో షూటింగ్ సెట్స్‌కు అక్కినేని అభిమానులంతా క్యూ కడుతున్నారు. తమ అభిమాన హీరోను చూసేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్‌కి గుంపులు గుంపులుగా చేరారు. దీంతో నాగచైతన్య అక్కడికి వచ్చిన అభిమానులందరిని కలిసి వారితో ఫొటోలు దిగాడు.
అయితే అక్కడ నదిలో నాగచైతన్యతో ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీరాభిమాని చైతును చూసేందుకు ఏకంగా నదిలోకే దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చిత్రీకరణ మధ్యలో అభిమాని నదిలో దూకడంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డైరెక్టర్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాడు. ఆ తర్వాత చైతు సదరు అభిమానిని కలిసి ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని చెప్పి, కాసేపు అతడితో మాట్లాడాడు. అనంతరం అభిమానితో ఫొటో దిగి తిరిగి పింపించాడు. ఇక తన అభిమాన హీరోని కలిసే అవకాశం వచ్చినందుకు సదరు అభిమాని ఉబ్బితబ్బిబ్బైపోయాడు.
https://twitter.com/Aaryaprasad/status/1366723056211664898